వాళ్ళే కాదు, నేను కూడా కాలర్ ఎత్తాను – మహేశ్ బాబు

Published on May 12, 2019 3:58 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నైజాం లాంటి కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. కాగా చిత్రబృందం ఈ రోజు సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

ఈ సందర్భంగా మహేశ్ బాబు నరేష్ గురించి మాట్లాడుతూ… ‘నరేష్ గారు ఈ సినిమా మీరు ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దత్ గారు, దిల్ రాజు గారు, పివిపి గారి పెద్ద బ్యానర్లు నా 25వ సినిమా ని ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. ఇంత బిగ్గెస్ట్ హిట్ చేసిన ఆడియెన్స్, ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్. అన్నారు.

అలాగే దర్శకుడు వంశీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ప్రి రిలీజ్ ఫంక్షన్లో నాన్నా గారి, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు అన్నాను వంశీ, వాళ్ళే కాదు ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను’ అని ఎమోషనల్ గా చెప్పారు.

సంబంధిత సమాచారం :

More