యువ హీరో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయనున్న మహేష్ !

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రాల్లో మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘మనసుకు నచ్చింది’ కూడా ఒకటి. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రోమో సాంగ్స్, లిరికల్ వీడియోస్ కు మంచి స్పందన లభించగా ఈరోపీజు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు టీమ్.

ఈ ట్రైలర్ ను మంజుల సోదరుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇందులో సందీప్ కిషన్ కు జంటగా అమైరా దస్తూర్ నటిస్తోంది. పి. కిరణ్, సంజయ్ స్వరూప్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రతన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు.