SSMB 28 : అంతా రెడీ … షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనట … ?

SSMB 28 : అంతా రెడీ … షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనట … ?

Published on Jul 5, 2022 1:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి త్వరలో ఒక భారీ మూవీకి పనిచేయనున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు కెరీర్ 28వ మూవీగా రూపొందనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్ తో ప్రేక్షకుల్లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న SSMB28 మూవీ అఫీషియల్ పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి.

అయితే కొన్నాళ్లుగా ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనే సందేహాలు అందరిలో మెదులుతున్నాయి. ఇక మూడు రోజుల క్రితం హైదరాబాద్ కి వచ్చిన మహేష్ ని నిన్న ప్రత్యేకంగా ఆయన నివాసంలో కలిసిన దర్శకుడు త్రివిక్రమ్ స్టోరీ, స్క్రిప్ట్ యొక్క ఫైనల్ నారేషన్ ఇచ్చారట. అలానే ఈనెల ఆఖరివారంలో మూవీ పక్కాగా మొదలెట్టేందుకు మూవీ రెడీ అయిందట. ఈ మూవీ షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది దీనిని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు