టాలెంటెడ్ డైరెక్టర్ తో మహేష్ ఫిక్సే ?

Published on Jul 21, 2019 11:04 pm IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న పరుశురామ్, తన తరువాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పరుశు రామ్ ఇటీవలే మహేశ్ కి స్క్రిప్ట్ చెప్పాడట. స్క్రిప్ట్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మహేశ్ కూడా సినిమా చెయ్యడానికి వెంటనే అంగీకరించడాని తెలుస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పరుశురామ్ – మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనే చాల సందర్భాల్లో కొరటాల.. తనకు నిర్మాణం పై ఎంతో ఆసక్తి ఉన్నట్లు చెప్పుకోచ్చాడు.

ఎలాగూ మహేష్ తో కొరటాలకి మంచి అనుబంధం ఉంది. కొరటాల అంటే తనకు ప్రత్యేకమైన గౌరవం అని మహేష్ కూడా ఆ మధ్య కామెంట్లు చేశాడు. ఇక ప్రస్తుతం మహేశ్ బాబు అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :