మహేష్ కుమార్తె అప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఐపోయింది.

Published on Nov 11, 2019 3:49 pm IST

మహేష్ గారాల పట్టి సితార డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారనుంది. ఏడేళ్ల ఈ చిన్నారి ఏకంగా హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పే అవకాశం దక్కించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన ఫ్రోజెన్ 2 చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పనుంది.దీనితో తమ సూపర్ స్టార్ మహేష్ కుమార్తె చిట్టి సితార వాయిస్ తెరపై విని ఆనందించాలని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చేస్తున్నారట. సితారతో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పించి ఫ్రోజెన్ 2 తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నిర్మాతలు మంచి ప్రచారం పొందారు.

సితార సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన క్యూట్ ఫొటోస్, లవ్లీ వీడియోస్ షేర్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది వినాయక చవితి సంధర్భంగా మట్టి వినాయకుడ్ని పూజించాలని దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురితో కలిసి ఓ ప్రత్యేక వీడియో చేసింది. ఇక ఫ్రోజెన్ 2 మూవీ ఈనెల 22న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More