మహేష్ డైరెక్టర్ షూట్ కి రెడీ ?

Published on Jan 24, 2021 11:12 am IST

‘మహర్షి’తో సూపర్ హిట్ కొట్టడంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు. దాంతో వంశీ వచ్చే వారం నుండి సారధి స్టూడియోలో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలుపెట్టబోతునట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఎనౌన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరి వంశీ ఈ సారి వెబ్ సిరీస్ కోసం ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారో చూడాలి. అన్నట్టు మిగిలిన స్టార్ హీరోలకు కథ చెబుతూ సినిమాని సెట్ చేసుకునే పనిలో కూడా ఉన్నాడని రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More