ప్రముఖ నిర్మాత, పిఆర్వో అకాల మరణం పట్ల మహేష్ ఎమోషనల్.!

Published on May 22, 2021 7:06 am IST

అసలు తెలుగు ఇండస్ట్రీకి సహా సినిమాను మినిమం ఫాలో అయ్యేవారికి ఇది మింగుడు పడని ఒక ఊహించని వార్త అని చెప్పాలి. మన టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగానే కాకుండా వెయ్యుకి పైగా సినిమాలకి పిఆర్వో గా వ్యవహరించిన ప్రముఖ పిఆర్వో బి ఏ రాజు గారు ఇక లేరు అన్న వార్త ప్రతి ఒక్కరినీ విస్మయానికి లోను చేసింది. దీనితో చిత్ర పరిశ్రమ అంతా ఆయన అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాజు గారికి మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ఆప్తులు అన్న విషయం తెలిసిందే. అందుకే మహేష్ ఒకింత ఎక్కువ ఎమోషనల్ అయ్యారు. రాజు గారు ఇక లేరు అన్న మాటే తాను తీసుకోలేకపోతున్నా అని మేము ఇద్దరం ఎన్నో ఏళ్ల నుంచి కలిసి పని చేస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి ఆయనతో ప్రయాణంలో ఆయన్ని చాలా దగ్గర నుంచి చూశానని మహేష్ తెలిపారు.

అలాగే ఆయన ఒక్క ప్రొఫైషినల్ గానే కాకుండా హృదయం లోతుల్లో నుంచి ఒక జెంటిల్మెన్ అని ఆయన లేని లోటు మా కుటుంబానికి, మీడియాకి తీరనిది అని తన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తూ మహేష్ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ కష్ట కాలంలో రాజు గారి తనయుడికి తన ప్రేమ, బలం ఎప్పుడు ఉంటాయని మహేష్ ధైర్యం చెప్పారు.

సంబంధిత సమాచారం :