మహేష్ కూడా సిక్స్ ప్యాక్ తో మెస్మరైజ్ చేస్తాడా..?

Published on May 23, 2020 7:17 am IST

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ సిక్స్ ప్యాక్ అవతరాలలోకి మారిపోయారు. ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ మరియు బన్నీ ఇప్పటికె వెండి తెరపై బేర్ బాడీలో కర్వ్డ్ మజిల్స్ తో రెచ్చిపోయారు. తమ అభిమాన హీరోని సిక్స్ ప్యాక్ బాడీలో చూడాలన్నది ఫ్యాన్స్ లో ఉండే క్రేజీ కోరిక. బాలీవుడ్ లో ఐదు పదులు దాటిన హీరోలు కూడా సిక్స్ ప్యాక్ ఎప్పుడో ట్రై చేయగా మన హీరోలు ఈ విషయంలో కొంచం స్లో అని చెప్పాలి. కాగా టాలీవుడ్ రాకుమారుడు ఒకప్పటి ప్రిన్స్ మహేష్ మాత్రం ఈ ఫీట్ కి ఇంకా దూరంగానే ఉన్నాడు.

సూపర్ స్టార్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన మహేష్ ఇంత వరకు సిక్స్ ప్యాక్ లో కనిపించక పోవడం వారి ఫ్యాన్స్ కి కొంచం నిరాశ కలిగించే అంశమే. గతంలో ఆయన సుకుమార్ డైరెక్షన్ లో చేసిన నేనొక్కడినే చిత్రంలో మహేష్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడని ప్రచారం జరిగినా పూర్తి స్థాయిలో కనిపించలేదు. మరి మహేష్ తన నెక్స్ట్ మూవీలో అయినా సిక్స్ ప్యాక్ లో కనిపించి ఫ్యాన్స్ కోరిక తీరుస్తాడేమో చూడాలి. మహేష్ తన తదుపరి చిత్రం పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More