దేవిశ్రీ నుండి మహేష్ ఫ్యాన్స్ ఆశిస్తుంది అదే..!

Published on Dec 4, 2019 12:15 pm IST

రాక్ స్టార్ దేవిశ్రీ సరిలేరు నీకెవ్వరు చిత్ర పాటలను తనకు అచ్చొచ్చిన ఐటెం నంబర్ తో మొదలెట్టారు. రాప్ తో కూడిన మాస్ ఐటెం ‘మైండ్ బ్లాక్…’ సాంగ్ ఇప్పుడు యూత్ ని ఊపేస్తోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సాంగ్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఐతే మహేష్ బాబు ఫ్యాన్స్ దేవిశ్రీ నుండి ఆశించే పాటలు వేరే ఉన్నాయి. శ్రీమంతుడు సినిమా కొరకు దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ మహేష్ ఫ్యాన్స్ కి ఆల్ టైం ఫేవరెట్. ముఖ్యంగా శృతి హాసన్ మరియు మహేష్ మధ్య మెలోడియస్ గా నేపథ్యంలో నడిచే సాంగ్స్ అలాగే డ్యూయెట్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరహా పాటలే ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి వారు ఆశిస్తున్నారు.

ఐతే శ్రీమంతుడు మూవీలో మహేష్ సోషల్ ఇష్యూస్ పై స్పందించే కోటీశ్వరుడి కొడుకు గా క్లాస్ రోల్ చేశారు. కానీ సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ ది రఫ్ గా కనిపించే మాస్ రోల్. ఈ తరుణంలో దేవిశ్రీ ఎలాంటి సాంగ్స్ అందిస్తారు అనేది చూడాలి. మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.2020 జనవరి 11న సంక్రాంతి మొదటి చిత్రంగా సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :

More