మహేష్ రికమెండ్ చేసిన పని చేస్తున్న ఫ్యాన్స్..!

Published on Jul 9, 2020 7:39 pm IST

తమ అభిమాన హీరో కోసం ఎంత వరకు వెళ్లగలిగే కల్ట్ ఫ్యాన్స్ చాలా మందే మన స్టార్ హీరోలకు ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్టుగా చెయ్యెత్తగానే ఆగిపోయే శక్తి ఎక్కడో కొంత మందికి ఇచ్చిన వ్యక్తులలో సూపర్ స్టార్ మహేష్ కూడా ఒకరని చెప్పాలి.

మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ సెలబ్రేషన్స్ కానీ మహేష్ ఫ్యాన్స్ చేస్తుంటారు. అలాగే మహేష్ మాటే వేదవాక్కు లా భావిస్తారు. అందులో భాగంగా మహేష్ రికమెండ్ చేసిన ఓ పనిని చేసే పనిలో మహేష్ ఫ్యాన్స్ పడ్డారు. నిన్న సూపర్ స్టార్ మహేష్ తాను చూసిన జెర్మన్ వెబ్ సిరీస్ “డార్క్” కోసం ప్రస్తావించి ప్రతి ఒక్కరు చూడాల్సిన వెబ్ సిరీస్ ఇదని రికమెండ్ చేశారు.

దీనితో తమకు తెలియకపోయినా ఈ వెబ్ సిరీస్ ను మహేష్ ఫ్యాన్స్ చూడటం మొదలు పెట్టారట. ఆ విషయాన్నే మహేష్ ఫ్యాన్స్ తెలుపుతున్నారు. అది తమకు ఎలా అనిపించిందో కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురాం తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More