ఈ ఒక్క ఫొటోతో పాత మహేష్ ను గుర్తు చేసిన సూపర్ స్టార్.!

Published on Dec 5, 2020 3:06 pm IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోల్లో ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఏజ్ పెరుగుతున్నా సరే ఏమాత్రం మహేష్ లో అది కనిపించదు. అయితే రీసెంట్ గా మహేష్ ప్రిపేర్ చేసిన లుక్స్ అయితే తన ఫ్యాన్స్ ను మరింత స్థాయిలో మెస్మరైజ్ చేస్తున్నాయి.

అలా ఆ మధ్య మహేష్ ఓ యాడ్ షూట్ కు గాను మార్చిన లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు అయితే మరో లుక్ ను విడుదల చెయ్యగా వింటేజ్ మహేష్ ను గుర్తు చేసారని చెప్పాలి. మరో కొత్త యాడ్ నిమిత్తం ప్లాన్ చేసిన ఫోటో షూట్ నుంచి మహేష్ తాలూకా లుక్ బయటకు వచ్చింది.

అందులో క్లాస్ అండ్ స్టన్నింగ్ గా మహేష్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ లో అయితే ఖచ్చితంగా “అతిధి” సినిమా లుక్స్ గుర్తు రాక మానవు. మొత్తానికి మాత్రం మహేష్ నుంచి వచ్చిన ఈ న్యూ లుక్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More