మహేష్ మ్యానియా స్టార్ట్ చేసేసిన అభిమానులు.!

Published on Jul 28, 2021 8:00 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.. మాస్, క్లాస్ ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల్లో కూడా మహేష్ కి భారీ ఫాలోయింగ్ సొంతం. మరి ఇది ఒక్క ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్లైన్ లో కూడా మహేష్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఫస్ట్ ఎవర్ రికార్డులు సెట్ చేసి పెట్టారు.

మరి ఇప్పుడు తమ అభిమాన హీరో బర్త్ ఇంకొన్ని రోజుల్లో రానుండగా తన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే సోషల్ మీడియాలో ఆల్రెడీ బర్త్ డే హంగామా షురూ చేసేసారు. ఇప్పటికే సోషల్ మీడియాలో హైపర్ యాక్టీవ్ గా ఉన్న సూపర్ స్టార్ అభిమానులు బర్త్ డే నాటికి సర్కారు వారి ట్రీట్స్ కి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ కన్ఫర్మ్ అయ్యినట్టు బజ్ వినిపిస్తుంది. అలాగే ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్న థమన్ కూడా కొన్ని హింట్స్ ఇస్తూ వస్తున్నాడు మరి ఆ ఫస్ట్ సింగిల్ కూడా ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :