మహేష్ మాస్ ట్రీట్ అప్పటికే రెడీ అవుతుందా.?

Published on Apr 25, 2021 12:24 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వింటేజ్ మహేష్ ను మళ్ళీ గుర్తు చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా నుంచి మోస్ట్లీ టీజర్ ఎప్పుడు వస్తుందో అన్న దానిపై గత కొన్ని రోజులు నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి దాని ప్రకారం దాదాపు ఈసారి మాస్ ఫీస్ట్ వచ్చే మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగానే విడుదల చేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ విస్తృరంగా నడుస్తుంది. అయితే మరి ఆ రోజు టీజర్ ఖచ్చితంగా ఉంటుందో లేదో కానీ మహేష్ ఫ్యాన్స్ ని ఎక్కడా నిరాశ పరచని అప్డేట్ అయితే డెఫినెట్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఆ మాస్ ఫీస్ట్ కోసం ఎదురు చూడడమే తరువాయి. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :