ఈ ఏడాదికి ముగింపుగా బిగ్ స్క్రీన్స్ పైకి కొత్త సినిమాలతో పాటుగా పాత సినిమాలు కూడా రీరిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో మళ్ళీ చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబుల క్లాసిక్ సినిమాలు మరోసారి రీరిలీజ్ అవుతున్నాయి. మరి ఆ చిత్రాలే “జల్సా” మరియు “మురారి”లు.
అయితే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల రీరిలీజ్ లను అభిమానులు ఎందుకో ఇదొక క్లాష్ లా ఫీలయిపోతున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఎంత క్లాష్ అయినా కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి ఇది అంతర్గతంగా కలిపే రీరిలీజ్ అనుకోవాలి.
ఎందుకంటే మురారి సినిమా కంప్లీట్ గా మహేష్ బాబు అభిమానులు ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం అయితే జల్సా మాత్రం అలా కాదు ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా అని చెప్పవచ్చు.
ఇదెలా అంటే ఈ సినిమా మొదలు కావడమే సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో మొదలవుతుంది. సో ఇద్దరు హీరోల అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకునే అంశమే ఇది. సో దీనిని క్లాష్ లా చూస్తే అందులో అర్ధమే లేదనుకోవాలి. మరి దీనిని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ గ్రహించి కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకుంటే మంచిది.


