మహేష్ వెకేషన్ ఆ కంట్రీ లోనే..!

Published on Jan 17, 2020 1:00 am IST

మహేష్ సంక్రాంతి కి అందిన అతిపెద్ద విజయంతో హ్యాపీగా ఉన్నారు. ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 68.22 కోట్ల షేర్ వసూలు చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయశాంతి ఓ కీలక రోల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు హన్మకొండలో మహేష్ అభిమానుల సమక్షంలో భారీ విజయోత్సవ వేడుక జరగనుంది.

ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మహేష్ కొద్దిరోజులలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లనున్నారన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వెకేషన్ మహేష్ అమెరికా లో ప్లాన్ చేశారట. అమెరికాలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ లో భార్యా, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయనున్నాడట. దాదాపు రెండు నెలలు అక్కడే మహేష్ ఉండనున్నారని తెలుస్తుంది. ఈ టూర్ ముగిసిన అనంతరం మహేష్ దర్శకుడు వంశి పైడిపల్లి చిత్ర షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More