మహేష్ ఫాలోయింగ్, మైండ్ బ్లోయింగ్

Published on Aug 2, 2019 8:15 am IST

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ ఒకరు. తాజాగా ‘భరత్ అనే నేను’,మహర్షి వంటి వరుస సూపర్ హిట్లు అందుకొని వేగంగా దూసుకుపోతున్నారు.ముఖ్యంగా మహేష్ లేడీస్ మరియు యూత్ ఫాలోయింగ్ లో మిగతా హీరోలకంటే ముందున్నారు. మహేష్ ఫాలోయింగ్ చూసిన అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఆయనను ఎంచుకుంటున్నాయి.

అలాగే సోషల్ మీడియాలో కూడా మహేష్ కి మాములు ఫాలోయింగ్ లేదు. తాగాజా మహేష్ ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య ఎనిమిది మిలియన్స్ కి చేరింది. ఇది టాలీవుడ్ టాప్ హీరో లందరి కంటే ఎక్కువ కావడం గమనార్హం. బయట అభిమానులతో అంతగా కనిపించని మహేష్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ వారితో టచ్ లో ఉంటారు.

ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “సరిలేరు నీకెవ్వరూ” చిత్ర షూటింగ్ లో మహేష్ పాల్గొంటున్నారు. దిల్ రాజు,అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన నటిస్తుండగా,దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :