అభిమానుల్ని రిక్వెస్ట్ చేసిన మహేష్ బాబు !

30th, March 2017 - 06:51:32 PM


మహేష్ బాబు – మురుగదాస్ డైరెక్షన్లో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పలు వాయిదాల తర్వాత నిన్న ఉగాదికి రిలీజవుతుందని అనుకోగా ఆ రోజు కూడా వాయిదా పడింది. దీంతో గత రెండు మూడు రోజులుగా ఫస్ట్ లుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు భారీ నిరాశే ఎదురైంది. దీంతో సోషల్ మీడియాలో తమ అసహనాన్ని బాహాటంగానే వ్యక్తం చేశారు అభిమానులు. దీంతో ఇన్నాళ్లు ఈ విషయంపై మాట్లాడని మహేష్ పరిస్థితి యొక్క తీవ్రతను గమనించి ఎట్టకేలకు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘డియర్ ఫ్యాన్స్ మహేష్ 23 ఫస్ట్ లుక్ కోసం మీరు ఎంత చూస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. మా టీమ్ సినిమా కోసం రాత్రి, పగలు సినిమా కోసం కష్టపడి షూటింగ్ చేస్తున్నాం. ఫస్ట్ లుక్ త్వరలోనే వస్తుంది. మీరంతా కాస్త ఓపిగ్గా ఉండండి’ అన్నారు. ఇలా స్వయంగా మహేష్ వివరణ ఇవ్వడంతో అభిమానులు కాస్త శాంతించారు. ప్రస్తుతం వియత్నాంలో షూటింగ్ చేస్తునం యూనిట్ ఏప్రిల్ 2వ తేదీ ఇండియా తిరిగిరానుంది.