సుకుమార్ తో సినిమా ఆగిపోవడానికి కారణం చెప్పిన మహేష్ !

Published on May 5, 2019 1:42 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి విడుదలకు సమయం దగ్గర పడింది. దాంతో మహేష్ ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మహేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మహర్షి తరువాత ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నాను కానీ సుకుమార్ ఇంటెన్స్ తో కూడిన సీరియస్ స్టోరీ ని చెప్పాడు దాంతో సుకుమార్ ను కాదని అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను దానికి సుకుమార్ కూడా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా మళ్ళీ సుకుమార్ తో సినిమాలు చేస్తానని మహేష్ అన్నారు.

ఇక అలాగే ఎస్ ఎస్ రాజమౌళి తో సినిమా చేస్తానని ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఈప్రాజెక్టు గురించి ప్రకటన వస్తుందని తెలిపారు.

సంబంధిత సమాచారం :

More