మాస్ ఎంటర్టైనర్లు చేయనంటునున్న మహేష్ !

Published on Jan 30, 2019 8:45 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా భరత్ అనే నేను కంటే ముందు విడుదలైన ‘బ్రహ్మోత్సవం , స్పైడర్ చిత్రాలు డిజాస్టర్ లు కావడం మహేష్ ను ఆలోచనలో పడేసింది. ఇక ఈచిత్రాల ప్రభావం తో మహేష్ యూనిక్యూ సబ్జెక్టు లపైనే దృష్టిపెట్టాడు.

మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ సబ్జెక్టు తో ప్రేక్షకులను ఆలోచింపజేసే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈచిత్రం ఏప్రిల్ 25న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ , సుకుమార్ దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటించనున్నాడు. ఈసినిమా కూడా యూనిక్యూ సబ్జెక్టు తో తెరకెక్కనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇలా యూనిక్యూ సబ్జెక్టులను మాత్రం సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తానని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనెర్ చిత్రాలు చేయనని మహేష్ తాజాగా అభిమానుల తో జరిపిన చిట్ చాట్ లో వెల్లడించారు.

సంబంధిత సమాచారం :