మహేష్ మళ్లీ ఆ ఫీట్ సాధిస్తారేమో చూడాలి

Published on Feb 16, 2020 11:58 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు హైదరాబాద్లోని ప్రధాన థియేటర్లలో క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ మొదటిది. ఈ థియేటర్ అంటే మహేష్ బాబుకు కూడా చాలా ఇష్టం. ఈ థియేటర్లో మహేష్ సినిమాలకు పలు రికార్డులున్నాయి. వాటిలో ప్రధానంగా కోటి గ్రాస్ రికార్డ్స్ ముఖ్యమైనవి. ఇప్పటివరకు మహేష్ చేసిన చిత్రాల్లో ‘ఒక్కడు, పోకిరి, మురారి, అతడు, మహర్షి’ సుదర్శన్ నందు కోటి గ్రాస్ కలెక్ట్ చేశాయి.

ఇక తాజాగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఇప్పటి వరకు రూ.91 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇప్పటికీ చిత్రం రోజులో నాలుగు షోలకు కలిపి 80,000 వరకు రాబడుతోంది. మరి ఫుల్ రన్ ముగిసేనాటికి చిత్రం టోటల్ గ్రాస్ కోటి మార్కును క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం కుటుంబంతో హాలీడే ఎంజాయ్ చేస్తున్న మహేష్ త్వరలోనే వంశీ పడిపల్లి దర్శకత్వంలో ఒక చిత్రం స్టార్ట్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More