మహేష్ చలవతో రక్షించబడ్డ మరో చిన్నారి ప్రాణం.!

Published on Oct 31, 2020 3:00 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఆన్ స్క్రీన్ లో ఎంత హుందాగా ఉంటారో స్క్రీన్ లో అందుకు తగ్గట్టు గానే ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంతో సింపుల్ గా కనిపిస్తుంటారు. అలాగే ఒక పెద్ద స్టార్ హీరో అనే కానీ సహాయ గుణంలో మాత్రం మహేష్ ఎంతో ఉన్నతమైన మనసు కలవారు. అలా ఎందరికో సహాయం మహేష్ చేసారు.

అయితే ఇప్పటి వరకు వేలాది మంది పసి ప్రాయాలకు గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణ దాతగా నిలిచి వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందానికి కారకులు అయ్యారు. ఇటీవలే ఓ ఇద్దరు పిల్లలకు ఆపరేషన్లు చేయించి ప్రాణాలు కాపాడిన మహేష్ వల్ల ఇప్పుడు మరో చిన్నారి ప్రాణం ఊపిరిపోసుకుంది.

తనుశ్రీ అనే చిన్నారికి హృదయ నాళంకు సంబంధించి ఆపరేషన్ చేయించడం ద్వారా మహేష్ మరో ప్రాణాన్ని కాపాడినట్టయ్యింది. దీనితో చాలా ఆనందంగా ఉందని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఒక పక్క మహేష్ ఇలాంటి ఉన్నతమైన పనులు చేస్తూ అభిమానులను అలంరించేందుకు అద్భుతమైన సినిమాలను కూడా చేపడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More