‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అంటున్న మహేష్..!

Published on Feb 26, 2020 8:04 am IST

ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో, నిర్మాతలతో దర్శకులు మరియు నటులు ఎంతో సాన్నిహిత్యంతో ఉంటారు. సమయం దొరికితే వారిని కలుసుకోవడానికి, సందర్భం వస్తే వారిని ఆకాశానికి ఎత్తివేయడాని సిద్ధం ఉంటారు. పరిశ్రమలో అవకాశాలు రావాలంటే లౌక్యం చాలా అవసరం. మహేష్ బాబుతో మొదటిసారి మహర్షి సినిమాకు వంశీ పైడిపల్లి పనిచేశారు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దానితో మహేష్ వంశీ మధ్య ఘాడమైన స్నేహం ఏర్పడింది.

మహేష్ ప్రతి వేడుకలో వంశీ కనిపించేవాడు. కేవలం ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యే ఫంక్షన్స్ కి కూడా మహేష్ నుండి వంశీ కి కూడా ఆహ్వానం ఉండేది. మహర్షి సినిమా అనంతరం మహేష్ ఫ్యామిలీతో వరల్డ్ టూర్ కి వెళ్లగా, వంశీ కూడా లండన్ లో వారితో జాయిన్ అయ్యారు. మహేష్ కుటుంబంతో కలిసి వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించారు. ఒక్క సినిమాతో వంశీ మహేష్ కి ఇంత పెద్ద మిత్రుడు ఎలా అయ్యారు అని అనుకున్నారు అందరూ. మరి అంత గొప్ప సన్నిహితుడు వంశీని మహేష్ పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహేష్ ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే… ‘అనే సిద్ధాంతం ఫాలో అవుతునట్టున్నాడు. మొహమాటానికి పోయి సినిమా ఒప్పుకోవడం మంచిది కాదని ఆయన భావించినట్టున్నారు.

సంబంధిత సమాచారం :