మహేష్ స్టేట్మెంట్ బిగ్ బాస్ పై ఆసక్తిని చంపేసిందే…!

Published on Oct 22, 2019 12:46 pm IST

కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా షుమారు మూడు నెలల ముందు మొదలైన బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ చివరి దశకు చేరింది. 100 ఎపిసోడ్స్ కలిగిన ఈ షో ఇంకా కేవలం కొద్దిరోజులలో పూర్తి కానుంది. కాగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఇంకొద్ది రోజులలో తేలిపోనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. శ్రీముఖి,వరుణ్, బాబా భాస్కర్,అలీ,శివ జ్యోతి,రాహుల్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్. వీరిలో ఒకరు 50లక్షల ప్రైజ్ మనీ తో పాటు, బిగ్ బాస్ విన్నింగ్ టైటిల్ అందుకోనున్నారు.

కాగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా షో పై సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు కొందరి పట్ల పక్షపాతంగా ఉంటున్నారని ఆయన కుండలు బద్దలు కొట్టారు. యాంకర్ శ్రీముఖికి పరోక్షంగా ఫేవర్ చేస్తూ ఆమె హౌస్ లో కొనసాగేలా సహాయం చేస్తున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆమె టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు అని ఆయన చెప్పడం విశేషం. గతంలో కూడా శ్రీముఖి పై కొందరు ఇలాంటి ఆరోపణలే చేసిన క్రమంలో బిగ్ బాస్ షో పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. విన్నర్ వారికి నచ్చిన వారిని ఎంచుకునే దానికి, ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నట్లుగా ఈ వోటింగ్ ఎందుకు అని కొందరి వాదన. ఈ ఆరోపణలలో నిజం ఎంతో తెలియదు కానీ, మహేష్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం :

More