ఓ అధ్బుత ఫోటో పంచుకున్న మహేష్..!

Published on Jul 9, 2020 11:32 am IST

హీరోగా అనేక ప్రయోగాత్మక చిత్రాలలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆయన నట వారసుడిగా టాలీవుడ్ కి పరిచయమైన మహేష్ స్టార్ గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న మహేష్ తన తండ్రి కృష్ణను ఎంతగానో ప్రేమిస్తారు. కాగా మహేష్ నేడు తన తండ్రితో కలిసున్న ఓ త్రో బ్యాక్ పిక్ పంచుకున్నారు. ఆ పిక్ లో తండ్రి కొడుకులు నవ్వులు చిందిస్తుండగా…కృష్ణ చిరునవ్వును మహేష్ ఎంతో విలువైనదిగా వర్ణించారు.

ఇక మహేష్ సెప్టెంబర్ నుండి షూటింగ్ లో బిజీ కానున్నాడు. దర్శకుడు పరుశురామ్ తో మహేష్ కొత్త మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ మూవీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More