సిఎం చాంబర్లో షూట్ చేస్తోన్న మహేష్ !

17th, October 2017 - 09:07:02 AM


‘స్పైడర్’ విడుదల తర్వాత కాస్త హాలీడే గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ ఈ మధ్యే తిరిగి కొరటాల శివ సినిమా ‘భరత్ అనే నేను’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నెల 14 న మొదలైన ఈ షూటింగ్ నవంబర్ 8 వరకు కొనసాగనుంది. కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ ను కూడా స్ట్రైకింగా చెప్పగల కొరటాల శివ ఈ చిత్రంలో రాజకీయ అంశాల్ని టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈరోజు నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రత్యేకంగా వేసిన సిఎం చాంబర్ సెట్లో జరగనుంది. ఈ షూట్లో హీరోయిన్ కైరా అద్వానితో పాటు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొంటున్నారు. గతంలో కొరటాల, మహేష్ ల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వనున్నారు.