ఇంకా మహర్షి మత్తులోనే మహేష్ బాబు !

Published on May 22, 2019 4:02 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జయాపజయాలను సీరియస్‌గా తీసుకుంటారనే సంగతి అందరికీ తెలుసు. కానీ అది ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం ‘మహర్షి’ విజయాన్ని చూశాకే అందరికీ తెలిసొచ్చింది. తన 25వ చిత్రం కావడంతో మహేష్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు. వంశీ పైడిపల్లి దాదాపు మూడేళ్లు ఈ సినిమా మీద పనిచేశారు. నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, పివిపిలు భారీగా ఖర్చు పెట్టారు. దీంతో సినిమా విజయం సాధించి తీరాలని మహేష్ కోరుకున్నారు.

ఆయన ఆశించినట్టే చిత్రం గ్రాండ్ సక్సెస్. మొదటి రోజే హిట్టని తేలింది. దీంతో మహేష్ ఎప్పుడూ లేనంతగా బయటికొచ్చి ప్రమోషన్లు చేశారు. ప్రతి వేదిక మీద ఈ సినిమా తన జీవితంలో మర్చిపోలేనిదని, విజయాన్ని ఎంతో గర్వంగా ఎంజాయ్ చేస్తున్నానని రెండు సార్లు కాలర్ ఎగరేసి మరీ చెప్పారు. ఇంతకుముందు సూపర్ హిట్లు కొట్టినా ఇంతలా ఆనందపడని మహేష్ మహర్షి ఆనందాన్ని ఆస్వాదించిన తీరు చూసి అభిమానులు సైతం ముచ్చటపడ్డారు.

సినిమా విడుదలైన తర్వాత వారం రోజులపాటు ప్రమోషన్లలో పాల్గొని ఎంజాయ్ చేసిన మహేష్ రెండు రోజుల క్రితమే కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయన మహర్షి మేనియాలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చిత్ర విజయాన్ని అనుక్షణం సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More