ఇంటర్వ్యూ : మహేష్ బాబు – ఇక నుండి నా ఫ్యాన్స్ మే లో నే నా సినిమాలు రిలీజ్ చేయమని అడుగుతారు !

Published on May 4, 2019 5:20 pm IST

మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి ఈనెల 9 న గ్రాండ్ గా విడుదలకానుంది. దాంతో ప్రస్తుతం మహేష్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. అందులో భాగంగా మహేష్ తాజాగా మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఈ చిత్రం ఒప్పుకోవడానికి గల కారణం ?

వంశీ 40 నిమిషాలు ఈ కథ చెప్పాడు ఆయన చెప్పిన స్టోరి థ్రిల్లింగ్ గా అనిపించింది అయితే అప్పటికి నా డేట్స్ ఖాళీగాలేకపోవడంతో వంశీని వెయిట్ చేస్తావా అని అడిగాను. ఆయన రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆలా మహర్షి నా 25వ సినిమా అయ్యింది.

ఈచిత్రంలో శ్రీమంతుడు పోలికలు ఉన్నాయా ?

ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ సినిమా చూసాక తెలుస్తుంది మీకు సినిమా కు శ్రీమంతుడు తో పోలికలు ఉన్నాయా అని ఈ రెండు కంప్లీట్ గా డిఫ్రెంట్ మూవీస్.

మహర్షి లో ప్రత్యేకత ఏంటి ?

మహర్షి లో స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది అది అందరికి కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రభావం సమాజం ఫై కూడా వుంటుంది కానీ సినిమా రిలీజ్ అయ్యేక చూడాలి సమాజం ఫై ఎంత వరకు ప్రభావం చూపుతుందని.

మీ నాన్న గారు ఈ సినిమా చూశారా ?

అవును చూశారు ఆయన చాలా హ్యాపీ గా వున్నారు సినిమా పట్ల ఆయనే నాకు పెద్ద క్రిటిక్. ఏదయినా చాలా నిజాయితీగా ఏది దాచకుండ చెప్పేస్తారు. మహర్షి పట్ల మాత్రం చాలా హ్యాపీ గా వున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి అలాగే సుకుమార్ ల పేర్లు చెప్పకపోవడానికి కారణం ?

మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పూరి జగన్నాథ్ గారిని సుకుమార్ గారిని మర్చి పోవడం నా మిస్టేక్. ఫాన్స్ స్టేజి మీదికి రావడంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సుకుమార్ నాకు మంచి ఫ్రెండ్. అతనితో వర్క్ చేయడానికి నేను ఎప్పుడు రెడీ.

కొత్త దర్శకులతో సినిమాలు చేయరా ?

కొత్త వారితో సినిమా చేయను అనేది ఫాల్స్ న్యూస్. న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు ఎవరు కూడా నన్ను స్క్రిప్ట్ తో వచ్చి కలువలేదు. కొత్త తరహా సినిమా చేయాలని నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను.

గత సినిమాల పరాజయాలనుండి ఏం నేర్చుకున్నారు ?

అరగంట విని కథలు ఓకే చేయట్లేదు. మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నా. గతం లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటున్నాను. బహ్మ్మోత్సవం , స్పైడర్ 20 నిమిషాలే విని ఒప్పుకున్నవి. కానీ ఇప్పుడు ఆలా కాదు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమా చేస్తా.

మీ తదుపరి సినిమాల గురించి ?

ప్రస్తుతం అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాను. ఈసినిమా తరువాత రాజమౌళి సినిమాచేస్తాను. ప్రస్తుతం వాటికీ సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారకంగా ప్రకటన వెలుబడననుంది.

సంబంధిత సమాచారం :

More