మెగా కాంపౌండ్లో మహేష్ సినిమా ?

Published on Feb 18, 2020 6:55 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారనే వార్తలు చాలా రోజుల నుండి ప్రచారంలో ఉన్నాయి. కానీ వీటిపై ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ మహేష్ బాబుకు ఒక స్టోరీ లైన్ చెప్పారని, అది మహేష్ బాబుకు నచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్.

అంతేకాదు మహేష్ ప్రశాంత్ నీల్ ను మెగా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వద్దకు కథ నరేట్ చేయడానికి పంపారట. అన్నీ కుదిరితే త్వరలోనే ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశాలున్నాయట. ఇదే జరిగితే వీరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమా రూపుదిద్దుకోవడం ఖాయం. ఇకపోతే ప్రశాంత్ నీల్ ప్రజెంట్ ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉండగా మహేష్ త్వరలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More