డబుల్ ట్రీట్ తో ఫీస్ట్ ఇవ్వనున్న మహేష్.!

Published on May 1, 2021 12:00 pm IST

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబో అప్డేట్ కోసమే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎలాగో ఆ స్లైడ్ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో ఈ నెల స్టార్టింగ్ లోనే సూపర్బ్ కిక్ తో స్టార్ట్ చేసినా మంత్ ఎండింగ్ లో మరో అదిరే అప్డేట్ తో ట్రీట్ ఇవ్వడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. అదే ఇప్పుడు మహేష్ నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” అప్డేట్ తో..

ఈ అప్డేట్ విషయంపై గత కొంత కాలం నుంచి టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ అప్డేట్ కూడా కన్ఫర్మ్ అని తెలుస్తుంది. జస్ట్ దానిపై అధికారిక ప్రకటన మాత్రమే రావడం బ్యాలన్స్ ఉంది. మొత్తానికి మాత్రం ఈ నెలలో మహేష్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఫీస్ట్ ఖాయం అని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :