“సర్కారు” లో మాస్ లో క్లాస్ చూపించనున్న మహేష్.?

Published on Jul 14, 2021 7:04 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. విపరీతమైన హైప్ నమోదు చేసుకున్న ఈ చిత్రం మహేష్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం పరశురామ్ పెట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్ననే కొత్త షెడ్యూల్ నిమిత్తం మళ్ళీ షూట్ రీస్టార్ట్ అయిన ఈ చిత్రంలో ఒక్కో అంశంపై ఆసక్తికర నేపథ్యమే తెలుస్తుంది.

ముఖ్యంగా మహేష్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా అనిపిస్తుంది. లాస్ట్ టైం మహేష్ ప్రీ లుక్ పోస్టర్ చూసుకున్నట్టయితే హెయిర్ స్టైల్, టాటూ, చెవికి పోగు ఇవన్నీ మహేష్ లోని మాస్ యాంగిల్ ను చూపిస్తుండగా తన డ్రెస్సింగ్ మాత్రం ఇప్పటి వరకు బయటకొచ్చిన ఆన్ లొకేషన్ స్టిల్స్ చూస్తే అల్ట్రా స్టైలిష్ గా క్లాస్ గా కనిపిస్తుంది. దీనితో మహేష్ రోల్ పై మరింత ఆసక్తి రేకెత్తుతుంది. మరి ఈ మిక్సిడ్ కాంబో సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :