శ్రీ కృష్ణుడిగా మహేష్ బాబు బాగుంటారు – ఎన్టీఆర్

Published on Dec 6, 2021 7:02 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం తొలి సీజన్‌ నిన్నటితో ముగిసింది. అయితే, చివరి ఎపిసోడ్‌ లో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పాల్గొని సందడి చేయడం విశేషం. ఎన్టీఆర్ – మహేష్ ఒకే స్క్రీన్ ను పంచుకుని కనిపించడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు మహేష్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చి.. మొత్తం రూ.25 లక్షలను గెలుచుకున్నాడు.

ఇక ఈ ప్రశ్నల మధ్యలో మహేష్ – ఎన్టీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ క్రమంలో మహేష్ పలు విషయాలను ఎన్టీఆర్ తో పంచుకున్నాడు. మహేష్ తాను చిన్నతనంలో వీణ బాగా వాయించేవాడినని చెప్పాడు. ఇక తనకు తన ‘ఒక్కడు’ సినిమా పాటలు అంటే చాలా ఇష్టమని.. వాటిని వింటూ చాలా ఎంజాయ్‌ చేస్తానని మహేష్ తెలిపాడు.

అయితే, ‘మహాభారతంలోని పాత్రల్లో ఏ పాత్ర అంటే ఇష్టం..? ఒకవేళ సినిమాగా తెరకెక్కిస్తే ఏ పాత్రలో నటిస్తారు ?’ అంటూ ఎన్టీఆర్‌ ప్రశ్నించగా.. మహేష్ సమాధానమిస్తూ.. ‘మహాభారతంలో అన్ని పాత్రలు చాలా కీలకం, కాబట్టి ఫలానా పాత్ర అని ఎంచుకోవడం కష్టం’ అని మహేష్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ ప్రశ్న పై ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. ‘శ్రీ కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు బాగుంటారు’ అన్నారు.

ఇక మహేష్ తన ‘సర్కారు వారి పాట’ సినిమా గురించి చెబుతూ.. ‘ఈ సినిమా పోకిరిలా ఉంటుంది, నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌.. అలాగే ఎంటర్‌టైనింగ్‌ పాత్ర కూడా అని తెలిపారు.

సంబంధిత సమాచారం :