బావ విజయం గర్వకారణం అంటున్న మహేష్.

Published on May 25, 2019 4:10 pm IST

ఈ నెల 23 దేశవ్యాప్తంగా వెలువడిన ఎన్నికల ఫలితాలలో మహేష్ బావగారైన గల్లా జయదేవ్ గుంటూరు ఎం.పి గా గెలుపొందారు. ఆయన పొందిన ఈ విజయానికి ట్విట్టర్ వేదికగా స్పందించారు మహేష్. రెండవ సారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన గల్లా జయదేవ్ గారికి శుభాకాంక్షలు, ఈ విజయం ఎంతో గర్వకారణం అని ట్వీట్ చేశారు.

గల్లా జయదేవ్ టీడీపీ నుండి వైస్సార్సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల రెడ్డి పై 4205 ఓట్ల అతి స్వల్ప మెజారిటీ తో గెలుపొందారు. ప్రస్తుతం విదేశాలలో ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్న మహేష్ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులైన తరువాత బావ గెలుపు పై స్పందించడం ఆసక్తికరం.

సంబంధిత సమాచారం :

More