తన పుట్టినరోజునాడు అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్న ‘మహేష్ బాబు’

mahesh
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్, మురుగదాస్ లు ఈ సినిమాకు సంబందించి ప్రీ లుక్ ను ఆగష్టు 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అదేరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులకు కానుకగా ఈ ప్రీ లుక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇటీవలే ఈ సినిమా కోసం మహేష్ బాబు పై నిర్వహించిన లుక్ టెస్ట్ లోని ఫోటోలనే ప్రీ లుక్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. కానీ ఇప్పటివరకూ ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారమూ రాలేదు. బ్రహ్మోత్సవం అభిమానులను తీవ్రంగా నిరాశపరచడంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని మహేష్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రిన్స్ సీరియస్ లుక్ లో కనిపించనున్నాడట. ఇకపోతే ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.