‘మైండ్ బ్లాక్’ రికార్డు కొట్టిన మహేష్..!

Published on Jul 11, 2020 8:43 am IST

మహేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంచనాలు కొనసాగుతున్నాయి. ఆ మూవీలోని ‘మైండ్ బ్లాక్’ వీడియో సాంగ్ రికార్డు వ్యూస్ తో దుమ్మురేపుతోంది. దేవిశ్రీ స్వర కల్పనలో రూపొందిన మాస్ బీట్ సాంగ్ మైండ్ బ్లాక్ థియేటర్స్ లో సైతం దద్దరిల్లింది. ఎప్పుడూ లేని విధంగా మహేష్ ఎనర్జిటిక్ స్టెప్స్ తో రెచ్చిపోయారు. కాగా మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో 100 మిలియన్స్ మైలురాయిని చేరింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేశారు. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా…అనిల్ సుంకర, దిల్ రాజు మరియు మహేష్ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More