సౌత్ ఇండియాలోనే టాపర్ గా నిలిచిన మహేష్ !


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ కూడా ఒకటి. మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలున్నాయి. అంతేగాక నిన్న విడుదలైన టీజర్ వీడియో విశేష ఆదరణను దక్కించుకుని సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడంతో ఈ క్రేజ్ ఇంకాస్త పెరిగింది.

నిన్న ఉదయం పదిన్నర గంటలకు విడుదలైన ఈ టీజర్ సరిగ్గా 24 గంటలు గడిచే సయమానికి 6. 3 మిలియన్ వ్యూస్ ను సాధించి సౌత్ ఇండియాలోనే 24 గంటల్లో అత్యధిక హిట్స్ సాధించిన టీజర్ గా కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇక స్పైడర్ తర్వాత అజిత్ ‘వివేగం’ 6. 09 మిలియన్, రజనీ ‘కబాలి’ 5.1 మిలియన్, పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ 3. 7 మిలియన్ తో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేవలం టీజర్ ఈ స్థాయి ప్రభంజనం సృష్టించిన మహేష్ ట్రైలర్ తో ఇంకెంత భీభత్సం చేస్తాడో చూడాలి.

టీజర్ కొరకు క్లిక్ చేయండి