వైరల్ అవుతోన్న ‘మహర్షి’ పోస్టర్స్ !

వైరల్ అవుతోన్న ‘మహర్షి’ పోస్టర్స్ !

Published on Apr 17, 2019 5:06 PM IST

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా తాజాగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేసంది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పోస్టర్ లో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండటంతో.. సూపర్ స్టార్ అభిమానులు పోస్టర్స్ ను బాగా లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.

ఇక ఇటీవలే విడుదుల అయిన మహర్షి టీజర్ కూడా సినిమా పై అంచనాలకు రెట్టింపు చేసింది. ముఖ్యంగా టీజర్ లో మహేష్ బాబు మూడు వేరియేషన్స్ లో వ్యాపారవేత్తగా, స్టూడెంట్ గా మరియు ఒక కామెన్ మెన్ గా కనిపించి అలరించారు.

కాగా మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు