బాక్సాఫీస్ వద్ద మహేష్ “సర్కారు వారి పాట” ఊచకోత!

Published on May 24, 2022 2:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఎంటర్ టైన్మెంట్ తో పాటుగా, మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. టాలీవుడ్ లో 2022 బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం ఇప్పటి వరకూ 200 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ తాజాగా సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

మహేష్ బాబు రీజినల్ మూవీ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :