యూఎస్ లో మహేష్ “సర్కారు వారి పాట” దూకుడు!

Published on May 25, 2022 12:08 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి వసూళ్ళను రాబడుతోంది. ఈ చిత్రం యూ ఎస్ లో తన దూకుడు ను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు అక్కడ 2.3 మిలియన్ డాలర్ల వసూళ్ళను రాబట్టడం జరిగింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్ర ఖని, నదియా, తనికెళ్ళ భరణి, నాగబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :