సూపర్ స్టార్ మహేష్ “సర్కారు వారి పాట” తమిళ వెర్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారా?

Published on Apr 25, 2022 10:04 pm IST


సర్కారు వారి పాట మే 12,2022 న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. తమిళ సర్కిల్స్ లో గాసిప్ ప్రకారం, తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా 12 న విడుదల అవుతుంది. మహేష్ బాబుకు తమిళనాట భారీ ఫాలోయింగ్ ఉంది అతని సినిమాలకి తమిళ నాట మంచి క్రేజ్ ఉంది.

తెలుగు సినిమాలకు ఉత్తరాదిలో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ చిత్రం మున్ముందు హిందీలో డబ్బింగ్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి విడుదలకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్కారు వారి పాట బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతోంది మరియు ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం :