“యాత్ర” కి సీక్వెల్ తీస్తానంటున్న ఆ దర్శకుడు

Published on May 23, 2019 8:23 pm IST

దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ “యాత్ర”. మహి రాఘవ ఈ మూవీకి దర్శకత్వం వహించడం జరిగింది. క్లిష్ట పరిస్థుల్లో ఉన్న పార్టీని వైస్సార్ ఎలా నిలబెట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి,అధికారం చేజిక్కించుకోవడానికి పాదయాత్ర ఎలా ఉపయోగపడించి అన్న విషయాలను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు మహి రాఘవ. వైస్సార్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చాలా హుందాగా నటించాడు.

ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాలలో జగన్ అఖండ విజయం సాధించడంతో జగన్ పాదయాత్రను “యాత్ర-2” పేరుతో సినిమా తీస్తాను అని చెప్పారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన ఆయన, జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More