‘విరాట పర్వం’లో కొత్త కెమెరామెన్ !

Published on Nov 18, 2019 4:28 pm IST

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో సినిమాగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాట పర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కెమెరామెన్ జయకృష్ణ గుమ్మడి కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘మహానటి’కి కెమెరామెన గా పని చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘డాని సాంచెజ్ లోపెజ్’ ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేయబోతున్నారు.

ఇక రానా డిసెంబర్‌ లో జరగనున్న షెడ్యూల్ లో షూటింగ్‌లో పాల్గొననున్నారు. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాలో రానా పోలీస్ గా నటిస్తుండగా సాయి పల్లవి జానపద గాయనిగా మరియు కొన్ని సన్నివేశాల్లో నక్సలైట్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. ఆ రోజుల్లో తెలుగు రాష్టాల్లో చోటు చేసుకున్న కొన్ని కీలక అంశాలతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేత సమస్య మరియు ఏక్తా యాత్ర నిరసన గురించి ఈ సినిమాలో ఉంటాయట. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :

X
More