‘ది రాజా సాబ్’ రన్‌టైమ్ పై మేకర్స్ క్లారిటీ.. లెంగ్త్ ఎంతో తెలుసా?

‘ది రాజా సాబ్’ రన్‌టైమ్ పై మేకర్స్ క్లారిటీ.. లెంగ్త్ ఎంతో తెలుసా?

Published on Jan 7, 2026 10:00 PM IST

The Raja Saab

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు పెంచాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ పై మేకర్స్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్ర నిడివి 2 గంటల 52 నిమిషాలు(యాడ్స్ కలుపుకుని) ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో గతంలో వచ్చిన మూడు గంటల రన్‌టైమ్ అనే వార్తలకు చెక్ పడిందని చెప్పాలి. ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలతో పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో వస్తున్న ఈ రాజా సాబ్ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు