గొడవల కారణంగా స్టార్ హీరో సినిమా పేరు మారిపోయింది

Published on Oct 29, 2020 9:06 pm IST

నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ‘కాంచన’ సినిమాను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నారు. అయితే మొదటి నుండి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రాజెక్ట్ మొదలైన కొన్నిరోజులకే క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు లారెన్స్ ప్రకటించారు. ఈలోపు అక్షయ్ కుమార్ కలుగజేసుకోవడంతో లారెన్స్ తిరిగి దర్శకత్వ బాధ్యతలను అందుకున్నారు.

ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల కూడ వాయిదాపడింది. ఈ గండాలన్నిటినీ దాటుకుని సినిమాను ఫినిష్ చేశారు టీమ్. విడుదలైన ట్రైలర్ కూడ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈలోపు సినిమాకు పెట్టిన ‘లక్ష్మీ బాంబ్’ పేరు మీద అభ్యంతరాలు మొదలయ్యాయి. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆ పేరును తొలగించాలని కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. దీంతో ఆలోచనలోపడిన టీమ్ విడుదల సమయంలో అనవసర వివాదాలను పెంచుకోవడం ఇష్టంలేక సినిమా పేరును ‘లక్ష్మీ’ గా మార్చారు. నవంబర్ 9 ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ ద్వారా విడుదలకానుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయకిగా నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More