వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తుంది..?

Published on Jul 14, 2020 2:36 pm IST

పవన్ కళ్యాణ్ నుండి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆయన చివరి చిత్రం అజ్ఞాతవాసి 2018 జనవరిలో విడుదలైంది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆయన్ని వెండితెరపై చూసి పండగ చేసుకోవాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ లేకపోతే మే నెలలోనే వారి కోరిక తీరేది.ఆయన కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నెలలుగా వాయిదాపడుతూ ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో షూటింగ్స్ ఎవరూ జరపడం లేదు.

తీవ్ర నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కి కొంచెం ఉపశమనం కలిగించడానికి వకీల్ సాబ్ చిత్ర యూనిట్ వారికి ఓ భారీ సర్ఫ్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకొని వకీల్ సాబ్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. పవన్ బర్త్ డే తేదీ సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ టీజర్ రానుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More