చరణ్ చిత్రానికి క్లాసిక్ టైటిల్ ?

Published on Oct 7, 2018 2:00 pm IST


బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న12వ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అవుతుంది. ఈచిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర నిర్మాత దానయ్య ఇటీవల ఫిలిం ఛాంబర్ లోఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో ఈ వార్తలకు భలం చేకూరినట్లయింది. మరి ఈక్లాసిక్ టైటిల్ ఈచిత్రం కోసమా లేక మరో చిత్రానికా అనే విషయం తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరో ప్రశాంత్ తో పాటు ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :