డియర్ కామ్రేడ్ కి కొన్ని కటింగ్లు కొన్ని యాడింగ్లు…!

Published on Jul 29, 2019 9:22 pm IST

‘డియర్ కామ్రేడ్’ సినిమా పాజిటివ్ టాక్ తెచుకొన్నప్పటికీ, సినిమా స్లోగా సాగడానికి అవసరం లేని కొన్ని సన్నివేశాలు కారణమని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దీనితో ఆలోచనలో పడ్డ మేకర్స్ ఈ చిత్ర నిడివి 13నిమిషాల మేర తగ్గించనున్నారట. సినిమా నెమ్మదించడానికి కారణమైన 13నిమిషాల సన్నివేశాలను తొలగించనున్నారని సమాచారం. అలాగే కాలేజ్ నేపథ్యంలో స్టూడెంట్స్ మధ్య సాగే ‘క్యాంటీన్ సాంగ్’ ని కలుపనున్నారట. క్యాంటీన్ సాంగ్ ని ప్రమోషన్స్ సమయంలో విడుదల చేసినప్పటికి చిత్రంలో చూపించలేదు. ఇప్పుడు అదనంగా ఆ పాటను యాడ్ చేయనున్నారు.

విజయ్ దేవరకొండ,రష్మిక మందాన జంటగా దర్శకుడు భరత్ కమ్మ తెరక్కెక్కించిన ‘డియర్ కామ్రేడ్’ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలైన తెలుగు,కన్నడ,మలయాళ,తమిళ భాషలలో విడుదల చేశారు
.

సంబంధిత సమాచారం :