Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ఇంటర్వ్యూ : మాళవిక నాయర్ – ‘టాక్సీవాలా’కు వస్తున్న రెస్పాన్స్ తో చాలా హ్యాపీ !
Published on Nov 20, 2018 4:51 pm IST

విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఈచిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించిన మాళవిక నాయర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం ..

టాక్సీవాలా కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది ?

చాలా సంతోషగా వుంది. ఈచిత్రం నేను భవిష్యత్తులో మరిన్ని మంచి స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అయ్యింది. ఈకథ రాహుల్ నాకు చెప్పిన వెంటనే ఓకే చెప్పాను. ఇక థియేటర్లలో ఈసినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను.

మీ పాత్ర నిడివి తక్కువ గా వుంది కదా ఎలా ఒప్పుకున్నారు ?

అవును. స్క్రీన్ టైం చాలా తక్కువే కానీ ముఖ్యమైన పాత్ర కాబట్టి చేశాను. నా పాత్ర తాలుకు చాలా సీన్లను షూట్ చేశారు కానీ అవన్నీ ఈ చిత్రంలో లేవు కానీ ఈసినిమా చేసినందుకు చాలా హ్యాపీ గా వుంది. ఈపాత్ర నిడివి విషయంలో ఎలాంటి కంప్లెట్స్ లేవు .

మహానటి లో అతిధి పాత్రలో నటించారుఅలాగే ఈ చిత్రంలో స్పెషల్ పాత్రలో నటించారు. ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి పాత్రల్లో నటిస్తారా ?

మహానటి ,సావిత్రి గారి బయోపిక్ అనే ఒక్క కారణంతోనే చేశాను. ఇక టాక్సీవాలా రెండు సంవత్సరాలక్రితం సైన్ చేశాను. నేనుచేసే పాత్ర సినిమాకు కీలకం అవుతుందనుకుంటేనే అలాంటి పాత్రలు చేయడానికి ఆలోచిస్తాను.

ఎలాంటి పాత్రల్లో నటించాలనుకుంటున్నారు ?

స్క్రిప్ట్ లో నేను చేసే పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం అలాగే ఫ్యూచర్ లో ఛాలెంజిగ్ రోల్స్ చేయాలనీ వుంది .

మీరు ఇండస్ట్రీ లో ఏమైనా వేధింపులకు గురైయ్యారా ?

లేదు. నేను చాలా జాగ్రతగా వుంటాను. నేను ఎక్కడికి వెళ్లిన నా తల్లితండ్రులు అలాగే నా మేనేజర్ నా వెంటే వుంటారు. సో నా కెప్పుడు అలాంటి వేధింపులు ఎదురుకాలేదు.

ప్రస్తుతం మీరు చదువుకుంటున్నారా ?

అవును. ప్రస్తుతం నేను డిగ్రీ చదువుతున్నాను అలాగే నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం.

సంబంధిత సమాచారం :