డిసెంబర్ నెలాఖర్లో ‘మామ మంచు.. అల్లుడు కంచు’!

డిసెంబర్ నెలాఖర్లో ‘మామ మంచు.. అల్లుడు కంచు’!

Published on Oct 20, 2015 5:25 PM IST

Mohan-Babu-Allari-Naresh1

విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు సినీ పరిమశ్రమలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు, ఈతరంలో తనదైన కామెడితో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్వించే కామెడీ స్టార్ అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. మామ మంచు అల్లుడు కంచు అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కామెడీ సినిమాలతో తనదైన మార్క్ సృష్టించుకున్న శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 24న ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. అదేవిధంగా డిసెంబర్ నెల చివరి వారంలో క్రిస్‌మస్ కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మోహన్ బాబు – అల్లరి నరేష్‌ల కాంబినేషన్ హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు