ప్రీ పోన్ అయిన మమ్ముట్టి ‘టర్బో’

ప్రీ పోన్ అయిన మమ్ముట్టి ‘టర్బో’

Published on May 1, 2024 2:01 AM IST

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఇటీవల తెరకెక్కిన హర్రర్ జానర్ మూవీ భ్రమయుగం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టర్బో. మమ్ముట్టి కంపెనీ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీని వైశాఖ్ తెరకెక్కిస్తుండగా జస్టిన్ వర్గేసే సంగీతం అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే, అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని జూన్ 13న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని ప్రీ పోన్ చేసి మే 23 న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్ గా నటిస్తున్న ఈ మూవీకి మిధుల్ మానుల్ థామస్ కథ ని అందించారు. మరి రిలీజ్ అనంతరం టర్బో ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు