సన్నీ లియోన్ కావాలంటూ ఆయనకు ఫోన్ చేస్తున్నారట.

Published on Aug 4, 2019 1:00 am IST

సినిమాలో ఓ సన్నివేశం కొరకు వాడిన ఫోన్ నెంబర్ ఒక వ్యక్తికి చిక్కులు తెచ్చిపెట్టింది. అసలు విషయం ఏమిటంటే సన్నీ లియోన్ నటించిన తాజా చిత్రం “అర్జున్ పాటియాలా” లో సన్నివేశంలో భాగంగా ఫోన్ నంబర్ చెప్పారు. దీనితో ఆ చిత్రం చూసిన సన్నీ లియోన్ అభిమానులు ఆ ఫోన్ నెంబర్ కి కాల్స్ చేయడం మొదలుపెట్టారట. నిజానికి చిత్రంలో సన్నీ చెప్పిన ఫోన్ నెంబర్ ఢిల్లీ కి చెందిన 27ఏళ్ల పునీత్ అగర్వాల్ కి చెందినది కావడంతో గత వారం రోజులుగా ఆయనకు వందలలో ఫోన్స్ కాల్స్ వస్తున్నాయట.

ఆయనకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరు సన్నీ లియోన్ కావాలి ఉన్నారా ?అని అడుగుతున్నారట.ఈ ఫోన్ కాల్స్ వలన ఆయన తన పనులు కూడా చేసుకోలేకపోతున్నారట. ఈ సంఘటనతో అయోమయం చెందిన పునీత్ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారట. సామజిక మాధ్యమాలలో విపరీతంగా ఈ సంఘటన వైరల్ కావడంతో సన్నీ లియోన్ వరకు ఈ విషయం చేరిందట. దానిలో విచారానికి గురైన సన్నీ సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పారట.

సంబంధిత సమాచారం :